అబ్దుల్లాపూర్​‌‌‌‌మెట్లో అధికారులపై దౌర్జన్యం..

  • అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్తే బౌన్సర్లతో దాడి
  • నోవా మెడికల్ కాలేజీపై ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అబ్దుల్లాపూర్​‌‌‌‌మెట్, వెలుగు:  బఫర్ జోన్​లో అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ ‌‌‌‌మెట్​ మండలం జాఫర్‌‌‌‌‌‌‌‌గూడ గ్రామ చెరువు బఫర్ జోన్‌‌‌‌లో నోవా మెడికల్ కాలేజ్ యాజమాన్యం అక్రమంగా నిర్మాణం చేపట్టింది. ఇరిగేషన్ అధికారులు దీనిని గుర్తించి, ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డికి సమాచారం అందించారు. ఆపై రెవెన్యూ ఇన్‌‌‌‌స్పెక్టర్, ఇరిగేషన్ ఏఈ తమ సిబ్బందితో కలిసి గురువారం అక్కడికి చేరుకొని, అక్రమ కట్టడాన్ని తొలగించారు. 

అదే సమయంలో అక్కడికి వచ్చిన కాలేజీకి చెందిన బౌన్సర్లు అధికారులతో గొడవకు దిగారు. దీంతో ఫొటోలు, వీడియోలు తీస్తున్న రెవెన్యూ అధికారులపై కాలేజీ బౌన్సర్లు, సిబ్బంది దాడి చేసి, వారి ఫోన్లు లాక్కున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ఏఈ వంశీతో కలిసి ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డి శుక్రవారం బఫర్ జోన్​లో నిర్మించిన నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లగా, అక్కడ కాలేజీ యాజమాన్యం తీరును చూసి అవాక్కయ్యారు. 24 గంటల్లోపే కూల్చిన ప్లేస్​లోనే తిరిగి నిర్మాణాన్ని చేపట్టారు. 

ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. నోవా కాలేజీ యాజమాన్యంపై పీఎస్ లో ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. చెరువు బఫర్ జోన్​ను ఆక్రమించి ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, త్వరలో బౌండరీలు ఫిక్స్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 

బిల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై మాజీ సర్పంచ్ దాడి

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు చేయాలని చెప్పినందుకు బిల్ కలెక్టర్ (కారోబార్)పై మాజీ సర్పంచ్‌‌‌‌ దాడి చేశాడు. అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌ మండలం గండిచెరువు గ్రామ పరిధిలోని ఓ వెంచర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వివాదాస్పద స్థలంలో కొంతమంది వ్యక్తులు బోరు వేస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందింది. ఆయన బిల్ కలెక్టర్ గిరీశ్‌‌‌‌కు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో వాటర్ మెన్‌‌‌‌తో కలిసి కారోబార్‌‌‌‌‌‌‌‌ గిరీశ్‌‌‌‌ అక్కడికి వెళ్లి, వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఫోన్‌‌‌‌ లాక్కొని మాజీ సర్పంచ్‌‌‌‌ జక్క పాపిరెడ్డి, మరో వ్యక్తి జక్క ధీరజ్‌‌‌‌రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.