పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల్లో కరెంటు షాక్ తో చనిపోయిన ముగ్గురు అభిమానులకు వకీల్ సాబ్ టీం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఇస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన ట్విట్టర్లో ప్రకటించింది.. వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరింది. వకీల్ సాబ్ మూవీని దిల్ రాజు,బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ఏడవ మైల్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంలు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. గాయపడిన నలుగురిని కుప్పంలోని పిఈఎస్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు.
వామ్మో.. ఏకంగా 220 కేజీలు ఎత్తిన బాలీవుడ్ హీరో
ఒక్కరోజే 78,357 కేసులు..1045 మరణాలు
ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ఫ్రైజ్.. వకీల్ సాబ్ బొమ్మ అదిరింది
తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా పాజిటివ్ కేసులు
— Sri Venkateswara Creations (@SVC_official) September 2, 2020
