Vaibhav Suryavanshi: సచిన్, కోహ్లీకి బిగ్ షాక్.. వెస్టిండీస్ దిగ్గజానికి ఓటేసిన 13 ఏళ్ళ భారత క్రికెటర్

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ముగిసిన ఇటీవలే ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జాక్ పాట్ కొట్టాడు.  రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ కోటీ పది లక్షలకు దక్కించుకుంది. పదమూడేళ్ల చిచ్చర పిడుగు వైభవ్ వంశీ కోటి పది లక్షలకు అమ్ముడుపోవడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది. అతని గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా భారత దిగ్గజ క్రికెటర్లకు సూర్యవంశీ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. 

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అతని రోల్ మోడల్ గురించి తెలిపాడు.  వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాను వైభవ్ సూర్యవంశీ తన రోల్ మోడల్ గా చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేరు చెప్పకుండా బిగ్ షాక్ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన ఈ యంగ్ క్రికెటర్.. సౌరవ్ గంగూలీ, రైనా పేర్లు కూడా చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శనివారం( నవంబర్ 30) పాకిస్థాన్ పై జరిగిన ఆసియా కప్ అండర్ 19 క్రికెట్ లో ఓపెనర్ గా దిగి ఒక పరుగు మాత్రమే చేశాడు.  

ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?

సూర్యవంశీ స్వస్థలం.. బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామం. ఇది సమస్తిపూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తండ్రి పేరు.. సంజీవ్ సూర్యవంశీ. 2011, మార్చి 27న జన్మించిన  ఈ బుడతడు.. నాలుగేళ్ళ వయస్సులో మొదటిసారి బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్.. కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. అక్కడే అతనికి రోజంతా గడిచిపోయేది. ఇరుగుపొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్‌కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి  అతన్ని సమస్తిపూర్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండున్నరేళ్ల శిక్షణ అనంతరం పదేళ్ల ప్రాయానికి అండర్- 16 క్రికెట్‌లోకి ప్రవేశించాడు.

ALSO READ : Champions Trophy 2025: వెనక్కి తగ్గిన పాకిస్థాన్..? హైబ్రిడ్‌ మోడ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

పదేళ్ల వయస్సులోనే వైభవ్.. బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ ఔరా అనిపించాడు. హేమన్ ట్రోఫీ, అంతర్-జిల్లా టోర్నమెంట్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లలో దాదాపు 800 పరుగులు చేశాడు. అదే ఫామ్‌ను వినూ మన్కడ్ ట్రోఫీలోన్యూ కొనసాగించాడు. 5 మ్యాచ్‌ల్లో 400కు పైగా పరుగులు చేశాడు. ఇక్కడే అతని దిశ తిరిగింది. బీహార్ బోర్డు దృష్టిలో పడ్డాడు.