వ్యాక్సినేషన్ కసరత్తు.. 4 రాష్ట్రాల్లో ట్రయల్స్
డిసెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహణ
అన్ని రాష్ట్రాల రెడీనెస్‌ను తెలుసుకోవడానికి కార్యక్రమం
వ్యాక్సినేషన్ ప్లానింగ్, కొవిన్ సాఫ్ట్‌వేర్ నిర్వహణపై స్టడీ
ఇప్పటికే వ్యాక్సినేటర్లకు ట్రైనింగ్.. కోల్డ్ స్టోరేజ్‌లు సిద్ధం
తొలి దశలో హెల్త్ వర్కర్లు కోటి మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 2 కోట్ల మందికి
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్ 19 టీకా డ్రై రన్‌ను కేంద్రం చేపట్టబోతోంది. వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు ఏ స్థాయిలో రెడీగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక సినిమా ట్రైలర్‌లాగా పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో ఈ రన్ నిర్వహించబోతోంది. ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల చొప్పున మొత్తం 8 జిల్లాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు అందించింది.
స్టార్టింగ్ దగ్గర్నుంచి ఎండింగ్ వరకు..
వ్యాక్సినేషనల్‌లో భాగంగా కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో డేటా ఎంట్రీ దగ్గర్నుంచి మాక్ డ్రిల్, టీమ్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్, వ్యాక్సినేషన్‌లో సమస్యలు తదితరాలను కేంద్రం పరిశీలించనుంది. వ్యాక్సినేటర్లు, టీకాలను వేసే ఇతర సిబ్బంది పనిని అధ్యయనం చేయనుంది. వ్యాక్సిన్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు, ట్రాన్స్‌పోర్టేషన్ నిర్వహణను కూడా అంచనా వేయనుంది. ప్రతి జిల్లాలో ఐదు రకాలుగా టీకా డ్రైవ్ చేపట్టనున్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అర్బన్ ప్రాంతం, ప్రైవేట్ హెల్త్ సెంటర్, గ్రామీణ ప్రాంతాలను డ్రై రన్‌కు ఎంచుకోనున్నారు. బ్లాక్, జిల్లా స్థాయిలో మాక్ డ్రిల్‌ను అంచనా వేసి ఆ డేటాను రాష్ట్ర, కేంద్ర స్థాయిలో అందించనున్నారు. ఇలా టీకా రవాణా దగ్గర్నుంచి వేసేంత వరకు ఎండ్ టు ఎండ్ పరిశీలించనున్నారు.
అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ కంప్లీట్
వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేటర్ల పని చాలా కీలకం. ఈ సిబ్బందికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చారు. వ్యాక్సినేటర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మెడికల్ ఆఫీసర్లు, కోల్డ్ చైన్ మెయింటెయిన్ చేసే వాళ్లు, ఆశా కో ఆర్డినేటర్లకు శిక్షణ పూర్తయింది. టీకా వేసే ప్రక్రియ, కొవిన్ పోర్టల్, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ, మేనేజ్‌మెంట్‌పై ట్రైనింగ్ ఇచ్చారు. నేషనల్ లెవెల్ ట్రైనింగ్‌లో 2,360 మంది పాల్గొన్నారు. ప్రస్తుతానికి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌లో పాల్గొనే సిబ్బంది ట్రైనింగ్ పూర్తయింది. 7 వేల మందికి పైగా ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. 681 జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్ల ట్రైనింగ్
పూర్తయింది.
కోల్డ్ స్టోరేజ్ పాయింట్లూ రెడీ
తొలి విడతలో 30 కోట్ల మందికి కేంద్రం వ్యాక్సిన్ వేయనున్న విషయం తెలిసిందే. టీకా వేయాల్సిన వాళ్లను ‘నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్’ టీమ్ 3 భాగాలుగా విభజించింది. వీళ్లలో హెల్త్ వర్కర్లు కోటి మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 2 కోట్ల మంది, ప్రయారిటీ ఏజ్ గ్రూప్ వాళ్లు 27 కోట్లమంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 28,947 కోల్డ్ చైన్ పాయింట్లను.. 85,634 ఎక్విప్‌మెంట్లను స్టోరేజ్ కోసం రెడీ చేశారు. ప్రస్తుతం 3 కోట్ల మందికి వేయాల్సిన టీకా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందని కేంద్రం చెప్పింది.
ఆస్పత్రుల గాలిలో మస్తు వైరస్
కరోనా పేషెంట్లు ఉన్న ఆస్పత్రుల్లో గాలిలో కూడా కరోనా వైరస్ ఎక్కువ స్థాయిలో ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. హాస్పిటళ్ల హాళ్లు, ఐసీయూ రూమ్‌లు, బాత్రూమ్‌లలో వైరస్ ఆనవాళ్లు విపరీతంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా మిగతా రూమ్‌లతో పోల్చితే ఐసీయూల్లో వైరస్ స్థాయి ఎక్కువుందని తెలిసింది. పేషెంట్లకు దగ్గర్లోని పరిసరాల్లో 471 శాంపిళ్లను తీసుకొని పరిశీలించామని, అందులో 82 శాంపిళ్లలో వైరస్ ఉందని తేలిందని సర్వే చెప్పింది. టాయిలెట్లలో 21 శాంపిళ్లు తీసుకోగా ఐదింటిలో, స్టాఫ్ ఏరియాలో 122 శాంపిళ్లు తీసుకోగా 15 శాంపిళ్లలో, పబ్లిక్ ప్రాంతాల్లో 42 శాంపిళ్లు తీసుకోగా 14 శాంపిళ్లలో వైరస్ ఉందని తేలిందని సర్వే వివరించింది. ఐసీయూల్లో 12 శాంపిళ్లు తీసుకోగా 5 శాంపిళ్లలో కరోనా కనబడిందని పేర్కొంది. ఈ సర్వేలో పేషెంట్లలో వైరస్ లోడ్, వాళ్లలో వ్యాధి తీవ్రతను అంచనా వేయలేదని వివరించింది.
For More News..
చైనాలో లోడ్ దించనిస్తలే.. మనోళ్లను వెనక్కి రానిస్తలే..
ఉచితంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్
రాత పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్
