13 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్

13 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌ జనవరి 13 నుంచి స్టార్టయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి సెంట్రల్‌‌ హెల్త్‌‌ మినిస్ట్రీ ఇండికేషన్‌‌ ఇచ్చింది. తయారీ నుంచి జనానికి చేరే వరకు వ్యాక్సిన్‌‌ పంపిణీకి పక్కా ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. టీకాల సరఫరా కోసం దేశవ్యాప్తంగా 37 కోల్డ్‌‌ స్టోరేజీలు రెడీగా ఉన్నాయని, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతాయని వివరించింది. ముందుగా చెప్పినట్టు హెల్త్‌‌ వర్కర్లు, ఫ్రంట్‌‌ లైన్‌‌ వర్కర్లకు వ్యాక్సిన్‌‌ వేస్తారు. కొవిన్‌‌ యాప్‌‌ ప్రజలకు అందుబాటులోకి రాగానే రిజిస్ట్రేషన్‌‌ ప్రాసెస్‌‌ స్టార్టవుతుంది. న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌‌‌‌ వ్యాక్సినేషన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ ఈ నెల 13 నుంచి మన దేశంలో స్టార్టయ్యే అవకాశం కనిపిస్తోంది. టీకాలకు అనుమతి వచ్చిన రోజు నుంచి 10 రోజుల్లోనే టీకాల పంపిణీ స్టార్ట్‌‌‌‌ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. వ్యాక్సిన్ల స్టోరేజ్‌‌‌‌ కోసం దేశంలో 4 ప్రైమరీ వ్యాక్సిన్‌‌‌‌ స్టోర్లను సిద్ధం చేశామని.. హర్యానాలోని కర్నాల్‌‌‌‌, ముంబై, చెన్నై, కోల్‌‌‌‌కతాల్లో స్టోర్లు సిద్ధమని మంగళవారం మీడియా బ్రీఫింగ్‌‌‌‌లో హెల్త్‌‌‌‌ మినిస్ట్రీ సెక్రటరీ రాజేశ్‌‌‌‌ భూషణ్ చెప్పారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా మరో 37 వ్యాక్సిన్‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌ సెంటర్లు ఉన్నాయన్నారు. వీటిల్లో బల్క్‌‌‌‌గా టీకాలను స్టోర్‌‌‌‌ చేసి తర్వాత డిస్ట్రిబ్యూట్‌‌‌‌ చేస్తామని వివరించారు. వ్యాక్సిన్ల స్టోరేజీ, టెంపరేచర్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ను డిజిటల్‌‌‌‌గా మానిటర్‌‌‌‌ చేస్తామని, పదేండ్లుగా ఇదే పద్ధతి తాము ఫాలో అవుతున్నామని తెలిపారు. హెల్త్‌‌‌‌ వర్కర్లు, ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ వర్కర్లు బెనిఫీషియరీలుగా రిజిస్టర్‌‌‌‌ చేసుకోవాల్సిన అవసరంలేదని, వాళ్ల డేటా కొవిన్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ డెలివరీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లో ఇప్పటికే ఉందని వివరించారు. సీరమ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌‌‌‌, భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ డెవలప్‌‌‌‌ చేస్తున్న కొవ్యాగ్జిన్‌‌‌‌కు డీసీజీఐ ఇప్పటికే అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కొవిన్‌‌‌‌తో పారదర్శకంగా.. వ్యాక్సినేషన్‌‌‌‌ కోసం కొవిడ్‌‌‌‌ వ్యాక్సినేషన్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌(కొవిన్‌‌‌‌) సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌, యాప్‌‌‌‌ను వాడనున్నారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ యాప్‌‌‌‌ను కేంద్రం రూపొందించింది. వ్యాక్సినేషన్‌‌‌‌ కోసం 700 జిల్లాల్లో 90 వేల మందికి ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చింది. సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి, సిబ్బంది పనితీరు అంచనాకు, టీకాల రవాణా నుంచి వేసే వరకు పూర్తి ప్రాసెస్‌‌‌‌లో లోటుపాట్లు గుర్తించడానికి దేశవ్యాప్తంగా డ్రై రన్స్‌‌‌‌ కూడా చేసింది. ఈ ప్రాసెస్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయిందని వెల్లడించింది. శభాష్‌‌‌‌ ఇండియా కరోనాపై పోరుకు ఇండియా తీసుకుంటున్న చర్యలపై ప్రపం చ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైరస్​ కట్టడికి ఇండియా తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ టెడ్రోస్​ ప్రశంసించారు. నిర్ణయాత్మక చర్యలతో ఇండియా ముందుగు సాగుతోందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సిన్‌‌‌‌ ఉత్పత్తిదారుగా అలా ముందు నడవడం మంచిదేనని చెప్పారు. అంతా కలసి పోరాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలను కాపాడగలమన్నారు.  మరోవైపు, బిల్​గేట్స్ కూడా కరోనా కంట్రోల్​కు ఇండియా తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు. కరోనాను తరిమికొట్టే ప్రయత్నంలో ఇండియా సైంటిఫిక్‌‌‌‌ ఇన్నోవేషన్లతో ముందుకు సాగుతోందని బిల్‌‌‌‌గేట్స్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు.