ఉత్తరాఖండ్ మంత్రి స్టైలే వేరు

ఉత్తరాఖండ్ మంత్రి స్టైలే వేరు

ప్రజాప్రతినిధులు, ఇతర లీడర్లు వెరైటీగా కనిపించాలని కోరుకుంటుంటారు. అందులో భాగంగా వారు వెరైటీ డ్రెస్ లను వేసుకుంటూ.. అందర్నీ ఆకట్టుకుంటారు. కానీ చాలా మంది నేతలు తెల్లటి ఖద్దరు దుస్తులను మాత్రమే వేసుకుంటుంటారు. ఈ ఎమ్మెల్యే మాత్రం వెరైటీ. ఉతర్తాఖండ్ కు చెందిన మంత్రి మాత్రం వెరైటీ దుస్తులను ధరించి.. .అందర్నీ ఆశ్చర్యపరిచారు.

సత్పాల్ మహరాజ్... ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భిన్నమైన దుస్తులు ధరించడం ఆయనకు ఆయనే సాటి. ఇటీవలే.. నోయిడాలో సౌత్ ఏషియన్ లీడింగ్ ట్రావెల్ షో జరిగింది. ఈ షోలో మంత్రి సత్పాల్ పాల్గొన్నారు. ఆయన ధరించి దుస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కుర్తా.. వేసుకున్న ఆయన దానిపై వెరైటీ కోటు వేసుకున్నారు. బాలీవుడ్ సినిమా పోస్టర్లతో ఈ కోటు ఉంది. నాగిన్, షోలే, సింగమ్, ఖూన్ భారీ మాంగ్, సీతా గీతాతో సహా పలు చిత్రాల పోస్టర్లు కోటుపై ఉన్నాయి.

ఈయన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే.. భిన్నమైన దుస్తులు ధరించడం ఆయనకు కొత్తేమీ కాదంటున్నారు. తన విభిన్నమైన ఆహార్యంతో ఆకట్టుకుంటారని పలువురు వెల్లడిస్తున్నారు. 1951, సెప్టెంబర్ 21న ఆయన జన్మించారు. కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎంపీగా గెలిచారు. 2014లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం : -

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది


జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు