ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. రావత్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని రోజుల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు.  పార్టీ అధిష్టానం సూచన మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో  నాయకత్వ మార్పులో భాగంగానే రావత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 10న బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్ కు సీఎం పదవి దక్కే అవకాశముంది.