డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. అయితే తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. తనను ఇటీవల కలిసిన వాళ్లంతా కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
