ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈనెల 18న కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అనారోగ్యం దృష్ట్యా వైద్యుల సలహా మేరకు ఆయన డెహ్రాడూన్ లోని డూన్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎం రావత్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు.
for more News..
పిల్లల్లో సోషల్ స్కిల్స్ పెరగాలంటే..
కరోనా వ్యాక్సిన్ తయారీకి గ్లోబల్ హబ్ గా హైదరాబాద్
పీఆర్సీపై హామీలు ఏమైనయ్?
