వెరీ షాకింగ్ : బ్యాటరీ స్కూటర్ పేలి.. ఇల్లు కూలిపోయింది..

వెరీ షాకింగ్ : బ్యాటరీ స్కూటర్ పేలి.. ఇల్లు కూలిపోయింది..

ఉత్తర్ ప్రదేశ్ లోని చౌక్ ప్రాంతంలో ఓ ఇంట్లో బ్యాటరీ స్కూటర్ ఛార్జ్ అవుతుండగా పేలింది. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని పోలీసు అధికారులు తెలిపారు. స్కూటీతో పాటు లక్షల విలువైన వస్తువులు కూడా అగ్నికి ఆహుతైంది. అయితే ఈ ఘటనా సమయంలో ఆ ఇంట్లో ఉన్న నలుగురు ఇంటి సభ్యులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్ నిగమ్ రోడ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ నసీమ్ ఇంట్లో ఈ ఘటన జరిగిందని చౌక్‌లోని అగ్నిమాపక స్టేషన్ అధికారి పుష్పేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. “మాకు సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ టెండర్లను పంపాం. వారు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు' అని ఆయన తెలిపారు.

ALSO READ: ఎంత ఆస్తి గొడవలు అయితే మాత్రం.. ఇలా రోడ్లపై కొట్టుకుంటారా..!

పేలిన స్కూటర్ చైనీస్ కంపెనీకి చెందిందని, ఏడాదిన్నర క్రితం దాన్ని రూ.65వేలకు కొనుగోలు చేశానని మహ్మద్ నసీమ్ తెలిపాడు.  “మేము భారీ శబ్దం విన్నప్పటికీ పేలుడు జరిగిందా లేదంటే అది కాలిపోయిందా అనేది ఖచ్చితంగా తెలియలేదు. నేను మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో స్కూటీని ఛార్జ్‌లో ఉంచాను. కానీ కొన్ని గంటల తర్వాత నేను మెట్లు దిగి వచ్చేసరికి పొగ, మంటలు కనిపించాయి. నేను వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకొని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చాను”అని మహ్మద్ చెప్పాడు. “నేను ఎప్పుడూ బ్యాటరీ స్కూటర్‌నే ఉపయోగిస్తాను. నేను బ్యాటరీ స్కూటర్లకు మారి 15 ఏళ్లు అయింది. అంతకుముందు వాడిన స్కూటర్లు ఇండియన్ బ్రాండ్లకు చెందినవి. కానీ ఈసారి నేను ఈ చైనీస్ స్కూటీని కొనుగోలు చేశాను. అది ఒక సంవత్సరం మాత్రమే బ్యాటరీ వారంటీని కలిగి ఉంది ” అన్నారాయన. మహ్మద్ చెప్తున్న దాని ప్రకారం, స్కూటీ ఛార్జర్ వేడెక్కడం వల్ల మంటలు సంభవించవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.