శివ్వంపేట, వెలుగు: ట్రిపుల్ఆర్ లో భూములు కోల్పోతున్న రైతుల రికార్డులు సరిగ్గా లేకపోవడంతో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని ఉసిరిక పల్లిలో రెవెన్యూ ఆఫీసర్లు మరో మారు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రికార్డులు సరిచేసి కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని కోరారు.
తాత, తండ్రుల నుంచి భూములు సాగు చేసుకుంటున్నామని, రెవెన్యూ ఆఫీసర్లు చేసిన తప్పులకు అమాయక రైతులను బలి చెయ్యొద్దని వేడుకున్నారు. కాగా ఆర్డీవో ఆదేశాల మేరకు ప్రతి రైతు భూమిని సర్వే చేసి రికార్డులు సరి చేసేందుకే రీ సర్వే నిర్వహిస్తున్నట్టు ఆర్ఐలు కిషన్, సునీల్, డివిజన్ సర్వేయర్ సుజాత, సర్వేయర్ రవికుమార్ తెలిపారు.