బెస్ట్​ కంట్రీస్ ర్యాంకింగ్స్​2024..ఇండియా 33వ స్థానం

యూఎస్​ న్యూస్​ అండ్​ వరల్డ్​ రిపోర్ట్​ సంస్థ 2024 సంవత్సరానికి నిర్వహించిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్​ల్లో ప్రపంచంలోనే వరుసగా మూడోసారి ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్​ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్​, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్​ల్లో భారత్​కు 33వ స్థానం దక్కింది. 

గత ఏడాదితో పోల్చితే మూడు ర్యాంకులు తగ్గాయి. మొత్తం 89 దేశాల్లో సర్వే జరిపి జీవన ప్రమాణాలు, సాహసాలు, వారసత్వం, వ్యాపార దక్షత, సాంస్కృతిక ప్రయోజనం తదితర 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని అభిప్రాయాలు ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. స్విట్టర్లాండ్​ జీవన నాణ్యత, వ్యాపార అవకాశాలు ఉన్నత స్థానంలో ఉండగా, వారసత్వ రంగంలో ఇది అత్యల్ప ర్యాంకింగ్​లో ఉంది. 

 2023లో 30వ స్థానంలో నిలిచిన భారత్​ 2024కు గాను మరో మూడు స్థానాలు దిగజారి 33వ స్థానానికి చేరుకున్నది. అయితే మూవర్స్​ (ఏడో స్థానం) ,హెరిటేజ్ (10వ స్థానం) విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. మూవర్స్​ అనే ఉప ర్యాంకింగ్​ ఒక దేశం స్థితిస్థాపక, అనుకూలతను కొలుస్తుంది. సామాజిక ప్రయోజనం, సాహసం విభాగాల్లో భారత్​ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇతర  ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడేవారిని మూవర్స్ గా నిర్వచించారు.