అమెరికా జాతీయ భద్రత, ప్రయోజనాలు, మానవ హక్కులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని వివరిస్తూ అమెరికా వాణిజ్య శాఖ చైనాతో ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఎక్స్ పోర్ట్స్ ప్రొహిబిట్డ్ లిస్ట్ లో చైనాకు చెందిన 36 టెక్ కంపెనీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విమాన విడిభాగాలు, రసాయనాలు, కంప్యూటర్ చిప్ తయారీ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ నిషేధంలో అమెరికా చైనా కంపెనీల ఎగుమతి లైసెన్స్ లు నిరాకరించొచ్చు లేదా వ్యాపారాలు జరపకుండా నిలిపివేయొచ్చు. కొన్నేండ్ల క్రితం హువావే కంపెనీని అమెరికాలో నిషేధించారు. అయితే, ఈ కంపెనీకి సలహాదారులుగా, అనుభంద సంస్థలుగా ఉన్న యాంగ్ జీ మెమరీ టెక్నాలజీస్, హెఫె కోర్ స్టోర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలను అమెరికా వాళ్ల దేశంలో నిషేధించింది.
