కర్నూలు జిల్లాలో యరేనియం కలకలం రేగింది. కప్పట్రాలలో యురేనియం తవ్వకాలు స్థానికుల్లో భయాందోళనలు కలుగజేస్తున్నాయి. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో 6.8 హెక్టార్లలో తవ్వకాలకు కేంద్రం 68 బోర్లకు అనుమతి ఇచ్చింది. పర్యావరణ శాఖ ఆమోదించిన వెంటనే తవ్వకాలు ప్రారంభమవుతాయి. యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు స్థానికులు నిరసన తెలిపారు.
యురేనియం అత్యంత ప్రమాదకరమైన రసాయన మూలకం. ప్రభుత్వాలు యురేనియం నిల్వలు తవ్వేందుకు సిద్దసడుతున్నారు. యురేనియం తవ్వడం మొదలుపెట్టామంటే.. మరణానికి స్వాగతం పలికినట్టేనని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా కాని ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వేందుకు 68 బోర్లకు అనుమతి ఇచ్చింది.