గతేడాది సివిల్స్ చివరి ప్రయత్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఊరటనివ్వలేదు. UPSC సివిల్ సర్వీసు పరీక్షలు రాసేందుకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ కరోనా కారణంగా గతేడాది పరీక్షలకు హాజరు కాకుండా… చివరి అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2020 అక్టోబర్‌లో సివిల్ సర్వీస్ పరీక్షలకు జరిగాయి…అయితే కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని, పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేదని పేర్కొంటూ మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎ.ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మరో అవకాశాన్ని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ… పిటిషన్‌ను కొట్టివేసింది.
అయితే అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం మొదట నిరాకరించినా…తర్వాత అంగీకరించింది. అయితే నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు వదిలేసింది. అయితే ఇలాంటి అవకాశం కల్పించడం ద్వారా కొంతమంది పట్ల వివక్ష చూపించినట్లు అవుతుందని భావించిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది.
