నా లవర్నే బ్లాక్మెయిల్ చేస్తావా.. బెస్ట్ ఫ్రెండ్ని సుత్తితో కొట్టి చంపిన మైనర్..

ఇంకా మెజారిటీ కూడా దాటలేదు.. ఓటు హక్కు కూడా రాలేదు.. కానీ అప్పుడే లవ్.. ఆ పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడే మైనర్ యువకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో తన ఫోన్ నుండి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటీలు, వీడియోలు దొంగిలించాడని, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడని స్నేహితుడుని సుత్తెతో కొట్టి చంపాడు ఓ మైనర్ బాలుడు. విషయం తెలుసుకున్న పోలీసులు  అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తప్పు ఒప్పుకున్నాడు. 

పోలీసుల వివరాల ప్రకారం 17 ఏళ్ల అభినవ్ (బాధితుడు) , అతని స్నేహితుడు (నిందితుడు) ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీరట్ లో ఇరుగుపొరుగున ఉండే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శనివారం (29 డిసెంబర్ 2024) ఇద్దరూ కోచింగ్ కి వెళ్లారు. సాయంత్రం అభినవ్ ఇంటికి రాకపోవడంతో.. తమ కొడుకు రాలేదేంటని అడగగా తను ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదని సమాధానం చెప్పాడు. 

రాత్రి అవుతున్నా అభినవ్ రాకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి సునీల్ కుమార్. అభినవ్ ఫ్రెండ్ పైనే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ALSO READ | ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ చూపించి ప్రశ్నించారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నారు.. కలిసి తిరిగారు కదా.. మరి అభినవ్ ఎక్కడ అని ప్రశ్నించగా సుత్తితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. 

అభినవ్ తన ఫోన్ నుంచి తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోస్, వీడియోస్ తనకు తెలియకుండా తీసుకున్నాడని చెప్పాడు. ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని, అందుకే చంపేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే పథకం ప్రకారం అభినవ్ ను చంపినట్లు ఒప్పుకున్నాడు.

ఇంత చిన్న వయసులో ఇంత నేర ప్రవృత్తి ఉందో చూడండి. మీరు కూడా మీ పిల్లల కదలికలను గమనిస్తూ ఉండండి. వాళ్లు ఫోన్ తో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టండి. లేదంటే ఇలాంటి ఘటనలు మన దగ్గర కూడా జరగడానికి ఆస్కారం ఉంది.