భర్తను వదిలేసి మామను పెళ్లాడిన యువతి

భర్తను వదిలేసి మామను పెళ్లాడిన యువతి

మైనర్లుగా ఉన్నప్పుడే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఆరు నెలలకే విడిపోయారు. అదే సమయంలో అతని తండ్రి కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తన తండ్రి కోసం వెతకడం మొదలు పెట్టాడు ఆ కొడుకు.  ఇలా తండ్రి కోసం వెతుకుతున్నఅతడికి  ఒక రోజు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే..తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యను తన తండ్రి పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసింది. తన భార్యే తనకు సవతి తల్లి అయ్యిందన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు ఆ కొడుకు.

అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో ఇద్దరు ప్రేమించి 2016లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వాళ్లిద్దరు మైనర్లు.   భర్త తాగుబోతని 6 నెలల తర్వాత వదిలేసి వెళ్లిపోయింది.  కలిసి ఉందామని భర్త ఎంత ప్రయత్నించిన ఆమె ససేమిరా అంది. అతన్ని విడిచి వెళ్లిపోయింది. అతడి తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 48 ఏళ్లున్న అతని  తండ్రి కూడా  ఇల్లు వదలిపోయాడు. తన తండ్రి ఆచూకి కనిపెట్టాలని జిల్లా ఆర్టీఐ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాడు.  అతడి తండ్రి కోసం వెతుకుతున్న అధికారులకు.. అతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంభాల్ లో జీవిస్తున్నాడని తెలిసింది. అయితే అతని తండ్రి పెళ్లి చేసుకున్న అమ్మాయి... ఇంతకుముందు తన కొడుకు పెళ్లి చేసుకున్నఅమ్మాయన్న విషయాన్ని గుర్తించారు.  ఇదే విషయం అతడి కొడుక్కి చెప్పారు అధికారులు. తన మాజీ భార్యపై  అతడి కొడుకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే తనకు మొదటి భర్త వద్దని రెండో భర్తతోనే ఉంటానని ఆమె తేల్చి చెప్పింది.అయితే వాళ్లిద్దరు మైనర్లుగా ఉన్నపుడు పెళ్లిచేసుకోవడంతో పెళ్లికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్  లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.