చనిపోయిండని పెట్టెలో పెడితే.. తెల్లారేసరికి తిరిగి లేచిండు

చనిపోయిండని పెట్టెలో పెడితే.. తెల్లారేసరికి తిరిగి లేచిండు

లక్నో: యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు టెస్ట్ చేసి అప్పటికే చనిపోయిండని చెప్పిన్రు. డెడ్​బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రాత్రంతా ఫ్రీజర్​లో పెట్టిన్రు. పంచనామాకు వచ్చిన పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పరిశీలిస్తుండగా అతడు కదిలినట్లు గమనించిన్రు. ఈ విషయం డాక్టర్లకు చెప్పడంతో వెంటనే అతడ్ని వార్డులోకి తరలించి ట్రీట్​మెంట్ స్టార్ట్ చేసిన్రు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్​లో శనివారం జరిగింది. శ్రీకేశ్ కుమార్ అనే వ్యక్తికి బైక్ యాక్సిడెంట్​లో గాయాలు కావడంతో బంధువులు శుక్రవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడు అప్పటికే చనిపోయాడని తేల్చిన డాక్టర్లు పోస్ట్ మార్టం కోసం సర్కారు దవాఖానాకు తరలించారు.

అక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్​కూడా శ్రీకేశ్ కుమార్​చనిపోయాడని కన్ఫామ్ చేయడంతో బాడీని  రాత్రంతా దాదాపు 6 గంటల పాటు మార్చురీ ఫ్రీజర్​లో ఉంచారు. తెల్లవారుజామున పంచనామాకు పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అతను బతికే ఉన్నట్లు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. అతడ్ని ఆస్పత్రి వార్డులోకి షిఫ్ట్ చేసి డాక్టర్లు ట్రీట్​మెంట్ స్టార్ట్ చేశారు. అతడు ఇంకా కోమాలో ఉన్నాడని తేల్చారు. అయితే, డాక్టర్లు అతడు చనిపోయినట్లు ఎలా చెప్పారనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.