లవ్ జీహాద్ (పెళ్లి కోసం మతం మార్చడం) ను ప్రోత్సహించేలా కార్యకలాపాలు చేపడితే కఠినంగా శిక్షించేందుకు ఉత్తర్ ప్రదేశ్ కేబినేట్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ కింద కొత్త చట్టానికి మద్దుతు పలికింది. ఆ చట్టానికి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అప్రూవల్ ఇచ్చారు. ఇక ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే పెళ్లి కోసం మతాన్ని మారేందుకు ప్రతయ్నత్నించినా, అందుకు అండగా నిలిచిన వారికి 10సంవత్సరాలకు పైగా జైలు శిక్షపడనుంది.
కాగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ మరియు హర్యానాలలో లవ్ జీహాద్ పేరుతో మహిళలపై జరుగుతున్న దారుణాల్ని అరికట్టేందుకు కొత్త చట్టాల్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించినట్లు విషయం తెలిసిందే.
