మతమార్పిడుల చట్టం వద్దు.. యోగికి మాజీ ఐఏఎస్‌‌ల లేఖ

మతమార్పిడుల చట్టం వద్దు.. యోగికి మాజీ ఐఏఎస్‌‌ల లేఖ
లక్నో: పెళ్లి పేరుతో మతమార్పిడిని నిషేధిస్తూ ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ మతమార్పిడి వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంపై వివాదం రేగుతోంది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు యోగి సర్కార్‌‌కు లేఖ రాశారు. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సదరు లేఖలో మాజీ ఐఏఎస్‌‌లు కోరారు. మత మార్పిడులపై తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల రాష్ట్రం విద్వేషపూరిత, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారిందని లేఖలో మాజీ ఐఏఎస్‌‌లు పేర్కొన్నారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావుతోపాటు ప్రధాన మంత్రికి మాజీ సలహాదారు అయిన టీకేఏ నాయర్ లేఖ రాసిన వారిలో ఉన్నారు.