పెబ్బేరు మండలంలో అకాల వర్షం..తడిసిన ధాన్యం

అకాల వర్షంతో పెబ్బేరు మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఇబ్బందులు పడ్డారు.  మంగళవారం ఉదయం నుంచి 3, 4 సార్లు కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసింది. నెల రోజులుగా తేమ శాతం రాకపోవడంతో ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.  

కాగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.  పెబ్బేరు, వెలుగు