JNTUలో 9మంది‌ విద్యార్ధులకు జాక్‪పాట్ : కంపెనీ బంఫర్ ఆఫర్

హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో అరుదైన రికార్డ్ చేసుచేసుకుంది. కూకట్ పల్లి JNTU క్యాంపస్ ప్లేస్‌మెంట్ లలో అత్యధిక ప్యాకేజీలతో యూనివర్సిటీ విద్యార్థులు ఎంపికై జాక్ పాట్ కొట్టారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది బీ టెక్ విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీతో జాబ్ కు సెలక్ట్ అయ్యారు. జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న  9 మంది విద్యార్థులకు రూ.19 లక్షల ప్యాకేజీ ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. 

ALSO READ | 2వేల ఉద్యోగాలు.. నర్స్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సోమవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో  ఒరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ వారికి సంవత్సరానికి 19 లక్షల వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చింది. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో సెలక్ట్ అయిన విద్యార్థులు సంతోషానికి అవదులు లేవు. ఫ్రెషర్లుగానే డెరెక్ట్ ఇంత ప్యాకేజీతో జాబ్ రావడంతో స్టూడెంట్స్ తోపాటు లెక్చరర్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలు బీ టెక్ చదువుతుండగానే అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించినందుకు తల్లిదండ్రులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.