టూల్స్​ & గాడ్జెట్స్ : జర్నీలో ఉపయోగపడే.. యూనివర్సల్​ మౌంట్​

సాధారణంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎంటర్​టైన్​మెంట్​ కోసం ఫోన్​లో వీడియోలు చూస్తుంటారు. కానీ.. చూసినంతసేపు ఫోన్​ని చేతిలో పట్టుకోవాలంటే చాలా చిరాకేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫోన్​ మౌంట్​ ఉంటే బాగుంటుంది. దీన్ని ఫ్లైట్, బస్​, ట్రైన్​, వర్క్‌‌స్టేషన్, డెస్క్, జిమ్, కిచెన్​.. ఎక్కడైనా మౌంట్​ చేసి వాడుకోవచ్చు.

ముఖ్యంగా ట్రావెలింగ్​లో ఉన్నప్పుడు ముందు సీటుకు తగిలించుకోవచ్చు. మిజీ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ మౌంట్​ని 360 డిగ్రీల వరకు  రొటేట్​ చేయొచ్చు. ఫోన్​ యాంగిల్​ని 290-డిగ్రీల వరకు, డైరెక్షన్​ని 360 డిగ్రీల వరకు అడ్జెస్ట్​ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ హోల్డర్‌‌ను 2.09–3.78 అంగుళాల మధ్య ఉన్న దేనికైనా మౌంట్​ చేసుకోవచ్చు. స్క్రీన్​ సైజు 4.7 నుంచి 6.9 అంగుళాల మధ్య ఉన్న ఏ ఫోన్​ అయినా దీనికి పెట్టుకోవచ్చు.  

ధర : రూ. 499