ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి : పిల్లి సుధాకర్

  • కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేను కోరిన మాలమహానాడు 
  • రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించడానికి సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేను మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కోరారు. గురువారం మాలల మహా పాదయాత్ర సిద్దిపేటకు చేరుకున్న సందర్భంగా పట్టణంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, రిపబ్లిక్​పార్టీ ఆఫ్​ఇండియా చీఫ్ రాందాస్ అథవాలేను కలసి విన్నవించారు.

తగు న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు సుధాకర్ పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రమేశ్, రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు, రాష్ట్ర  కార్యదర్శులు అంజయ్య, వెన్న రాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటస్వామి, పురుషోత్తం, రవికాంత్, సత్యనారాయణ పాల్గొన్నారు.