భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం

  • అల్లు అర్జున్​ ఇంటిపై దాడే నిదర్శనం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ మద్దతిస్తుందా? లేక ఆ పార్టీయే చేయించిందా? అని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని.. అందుకు ఈ ఘటనే నిదర్శనమని ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

కాంగ్రెస్ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. అల్లు అర్జున్ విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరును ఎంపీ లక్ష్మణ్​ ఖండించారు. జాతీయ అవార్డు గ్రహీత క్యారెక్టర్​ను తక్కువ చేయడం సరికాదన్నారు.