మేం తల్చుకుంటే మీరు రోడ్లపై తిరగరు..కాంగ్రెస్ కు కిషన్ రెడ్డి వార్నింగ్..

ఢిల్లీ: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యక ర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్  తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కిషన్ రెడ్డి. 

పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీసు పైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్డార్, సహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రె స్ కు  ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయని  హెచ్చరించారు కిషన్ రెడ్డి.

ALSO READ | నాంపల్లిలో ఉద్రిక్తత .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్