సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్తే తెలంగాణకు నష్టం : బండి సంజయ్

అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ఇష్యూ చర్చించాల్సిన అవసరం లేదన్నారు బండి సంజయ్. దీని వెనక మతలబేంటో సీఎం రేవంత్  బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలివెళ్ళాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడైతే సంతోషిస్తానన్నారు బండి సంజయ్.

ALSO READ | పనికి ఆహార పథకానికి మెదక్ చర్చ్ నిర్మాణం స్ఫూర్తి: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీయే అడుగడుగునా అవమానించిందన్నారు.. కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ చేసిన పాపం పోవాలంటే కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని.. సీఎం రేవంత్ దర్శించుకోవాలన్నారు. అలాగే విపక్ష నేత రాహుల్  గాంధీ పంచతీర్థాలు తిరగాలన్నారు. అలాచేస్తే కాంగ్రెస్ పాపం కొంతయినా పోతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతోనే మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు.