ఆ నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు

ఆ నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తగ్గుతోందన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. జనవరి 24 న పాజిటివిటీ రేటు రికార్డ్ స్థాయిలో 20.75 శాతానికి పెరిగితే.. ఇపుడు 4.44 శాతానికి పడిపోయిందన్నారు.  జనవరి 21న మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైతే ఇపుడు రోజు వారీ కేసులు లక్ష లోపు నమోదవుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7.90 లక్షల ఆక్టివ్ కేసులున్నాయన్నారు.   నాలుగు రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో 50 వేలకు పైగా ఆక్టివ్ కేసులున్నాయన్నారు. కేరళలో అత్యధికంగా రోజువారీ పాజిటివిటీ రేటు 29.57 శాతంగా ఉందన్నారు.