దేశంలో ఇథనాల్ డిస్టిలేషన్ కెపాసిటీ పెంచాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. ఆకాశ్ మిస్సైల్స్ ఎగుమతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో భద్రతా విధుల్లో ఉన్న విమానాలు కాకుండా.. వేరే మోడల్ విమానాలు ఎగుమతి చేయనున్నారు. అలాగే.. కృష్ణపట్నం , తుమకూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు కేంద్ర కేబినెట్ పర్మీషన్ ఇచ్చింది. అలాగే.. గ్రేటర్ నొయిడాలో మల్డీ మోడల్ లాజిస్టిక్ హబ్, మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
