కేంద్ర బడ్జెట్ లో విద్యుత్ రంగం కోసం నిధులు కేటాయించారు. విద్యుత్ రంగ సంస్కరణల కోసం ప్రత్యేక ప్రణాళిక, నిధులు కేటాయించారు. విద్యుత్ సంస్థలను పునరుత్తేజ పరిచేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు. ద్రవ్య లోటు 6.9 శాతంగా పేర్కొన్నారు. 2022-23 మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు. 2025-26 నాటికి ద్రవ్య లోటు 4.5 శాతానికి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతానికి ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు ఉన్నాయి. రిటర్న్‌ల దాఖలులో నవీకరణ తీసుకొచ్చారు. ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలులో నవీకరణ తెచ్చారు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్ పన్నును తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.
