ఈ ఏడాది పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈ ఏడాది పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతోంది. ఈసారి బడ్జెట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీలు ప్రింట్ చేయకూడదని నిర్ణయించింది. పేపర్ లెస్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. బడ్జెట్ కాపీలను ప్రింట్ చేసేందుకు 100కు పైగా వ్యక్తులను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్ లో ఉంచలేమని ఆర్థికశాఖ తెలిపింది. 1947 తర్వాత మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటి సారి.

బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు… రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.