కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో 2021-22 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్ తో పలు రంగాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే భారీగా పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో వీటి ధరలు మరింత పెరగనున్నాయి. ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో, పెరుగుతాయో ఓసారి పరిశీలిస్తే…
ధరలు పెరిగేవి
- సెల్‌ఫోన్లు, కార్ల విడిభాగాలు, చెప్పులు
- సోలార్ ఇన్వెర్టర్స్, లెదర్ వస్తువులు, కాటన్ దుస్తులు
- ఇంపోర్టెడ్ దుస్తులు, మద్యం, కాబూలీ శనగలు
- వంట నూనెలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, చేపలమేత
- గృహ నిర్మాణాల కోసం వాడే ప్లాస్టిక్, మెటల్, సింథటిక్ ప్రొడక్ట్స్
- ఎల్‌ఈడీ బల్బులు, ఇంపోర్టెడ్ వస్తువుల ధరల పెంపు
- ఆటో విడిభాగాలు, స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)
- రా సిల్స్, యాన్ సిల్క్(10 నుంచి 15 శాతానికి పెంపు)
- ఆల్కహాలిక్ బీవెరేజెస్, క్రూడ్ పామాయిల్
- విలువైన రాళ్లు, రత్నాలు
తగ్గేవి
- ఐరన్, స్టీలు, రాగి
- నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్
- కాపర్ వస్తువులు
- ఇన్సూరెన్స్
- షూస్
- బంగారం, వెండి , ప్లాటినం, పల్లాడియం
- వైద్య పరికరాలు, యంత్ర ధరలు
