Bank Jobs: యూనియన్‌ బ్యాంక్‌లో 1500 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, వేలల్లో జీతం

ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 సంవత్సరానికి 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 400 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్‌ 13వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 1500

  • తెలంగాణ: 200 ఖాళీలు
  • ఆంధ్ర ప్రదేశ్: 200 ఖాళీలు

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతో పాటు స్థానిక భాషపై పట్టు ఉండాలి.

వయోపరిమితి: 01/10/2024 నాటికి అభ్యర్థుల వయస్సు కనీష్టంగా 20, గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, EWS, OBC అభ్యర్థులు రూ.850 +GST... SC, ST, Pwd అభ్యర్థులు రూ.175+ GST చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 24, 2024
  • దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 13, 2024

నోటిఫికేషన్ కోసం Union Bank of India RECRUITMENT ఇక్కడ క్లిక్ చేయండి.

ALSO READ | పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు