యునిసెఫ్​ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రత్యేక కధనం

యూఎన్​ రిలీఫ్​ రిహాబిలిటేషన్​ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రభావితమైన పిల్లలు, తల్లులకు తక్షణ ఉపశమనం అందించడానికి యునిసెఫ్​ను 1946, డిసెంబర్ 11న ఏర్పాటు చేశారు. అందుకే ప్రతి ఏటా డిసెంబర్ 11న యునిసెఫ్​ వ్యవస్థాపక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 

ట్యాగ్​లైన్​: ఫర్ ఎవ్రీ చైల్డ్​
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్​

ప్రపంచవ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు, ఎయిడ్స్​ సోకిన పిల్లలు, తల్లులకు చికిత్సను అందించడం, మాతా శిశు పోషణను మెరుగుపరచడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, విద్యను ప్రోత్సహించడం, విపత్తులకు ప్రతిస్పందనగా అత్యవసర సహాయాన్ని అందించడం. ఇది ఒక పిల్లలకు మానవతా, అభివృద్ధి సహాయాన్ని అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. మొదట్లో యునైటెడ్​ నేషన్స్​ ఇంటర్నేషనల్​ చిల్డ్రన్స్​ ఎమర్జెన్సీ ఫండ్​(యునిసెఫ్​)గా ఇప్పుడు, అధికారికంగా యునైటెడ్​ నేషన్స్​ చిల్డ్రన్స్​ ఫండ్​గా పిలుస్తున్నారు.