ఓలా షోరూంకు చెప్పుల దండ

  • నెలలు గడుస్తున్నా బైక్​ సర్వీస్​చేయలేదని కస్టమర్​ నిరసన

రామచంద్రాపురం, వెలుగు: బ్యాటరీ సమస్య ఉందని సర్వీసింగ్ కు ఇచ్చిన బైక్​ను నెలలు గడుస్తున్నా తిరిగి ఇవ్వడంలేదని ఓ ఓలా కస్టమర్​ షోరూంకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని అశోక్​నగర్​లో శుక్రవారం జరిగింది. సంగారెడ్డికి చెందిన సంతోష్ కుమార్​ఏడాది కింద అశోక్​నగర్​లోని ఓలా షోరూంలో ఓ బైక్​ కొనుగోలు చేశాడు. 

ఇటీవల బ్యాటరీ సమస్య ఉందని, మైలేజ్ తక్కువ ఇస్తోందనే కారణంతో ఓలా సర్వీస్​సెంటర్​కు వచ్చాడు. వారం రోజుల్లో రిపేర్​ చేసి ఇస్తామని చెప్పిన నిర్వాహకులు నెల గడిచినా బైక్​ను సర్వీసింగ్​​ చేయలేదని, షోరూం వద్దకు వచ్చి అడిగితే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై వినిమోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు.