ఉప ఎన్నికల బరిలో ఫోగాట్ : రెండో సారైనా ఎమ్మెల్యేగా గెలవాలనే కల నెరవేరేనా

ఉప ఎన్నికల బరిలో ఫోగాట్ : రెండో సారైనా ఎమ్మెల్యేగా గెలవాలనే కల నెరవేరేనా

2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఇండియన్ స్టార్ రెజ్లర్ బబితా కుమారి ఫోగాట్ రాష్ట్ర క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.

ఈ ఏడాది నవంబర్ నెలలో సోనిపట్ ఉపఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బైపోల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా బబితా  రాష్ట్ర క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తూ  ఓ లేఖ విడుదల చేశారు. లేఖలో అనివార్యమైన పరిస్థితుల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.  నేను ఇటీవల క్రీడా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్నాను, కాని అనివార్య పరిస్థితుల కారణంగా నేను నా సేవలను కొనసాగించలేకపోతుట్లు చెప్పింది.

కాగా 30 ఏళ్ల  బబితా ఫోగాట్  హర్యానా ఎన్నికలకు ముందే ఆమె తండ్రి మహావీర్ ఫోగాట్‌తో కలిసి  బీజేపీలో చేరారు. ఫోగాట్ అక్కచెల్లెలు గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ లు  మూడుసార్లు కామన్వెల్త్ స్వర్ణ, రజత పతకాల్ని సాధించారు. వీరిద్దరిపై 2016లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ ను తెరకెక్కించారు. ఈ సినిమాలో బబితా సిస్టర్ కు అమీర్ ఖాన్ తండ్రిగా నటించారు.