భార్య వేధింపులు  తట్టుకోలేక భర్త ఆత్మహత్య

  • నెల రోజుల కిందటే వివాహం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెకండ్​ ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్  పట్టణంలోని నాగమాల్  బీసీ కాలనీకి చెందిన సాయి(21)తో  నెల రోజుల కింద హైదరాబాద్ కు చెందిన నందినితో వివాహం జరిగింది.

అప్పటి నుంచి భర్తతో సన్నిహితంగా ఉండకుండా.. వేధించింది. భార్య వేధింపులు తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంటిలో ఫ్యాన్​కు ఉరి వేసుకున్నాడు. మృతుడి బావ శేఖర్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.