మీరు మనుషులేనా : ప్రతి 10 నిమిషాలకు.. ఓ మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు..!

ఈరోజుల్లో కూడా మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. ఇది అక్కడ.. ఇక్కడ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. UN ఉమెన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ మహిళలపై హింస పెరుగుతుందని నివేదికలు వెల్లడించాయి. ఈ సంస్థలు విడుదల చేసిన డేటా చూస్తే భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలింతని ఉద్దేశపూర్వకంగా చంపేస్తున్నారట. 25 నవంబర్ 2024 మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఇంటిమేట్ పార్ట్‌నర్, ఫ్యామిలీ మెంబర్ స్త్రీహత్యలు తీవ్రమైనవని వెల్లడిస్తున్నాయి. స్త్రీలు, బాలికలపై హింస- ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని వారి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 2023లో 85వేల మంది మహిళలు, బాలికలను హత్య చేశారని స్వచ్ఛంద సంస్థలు వెల్లడించిన రిపోర్ట్ లో తేలింది. ఈ హత్యలలో 60 శాతం బాధితులకు దగ్గర వ్యక్తులు లేదా వారి భాగస్వాములే చేస్తున్నారట. ప్రతి రోజు 140 మంది మహిళలు, బాలికలు వారి భర్తలు లేదా బంధువుల చేతిలో మరణిస్తున్నారని డేటా లెక్కలున్నాయి. అంటే ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక హత్యకు గురైతుంది.

2023లో స్త్రీలపై జరిగిన హింసలో ఆఫ్రికా మొదట, ఆ తర్వాత అమెరికాల ఉంది. వీటి తర్వాత ఓషియానియా, ఐరోపాల్లో మహిళలపై హింసకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేరాల్లో ఎక్కువగా భర్త, కుటుంబ సభ్యులే ప్రధాన నేరస్థులుగా ఉన్నారు.