బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి మరోసారి సింప్లిసిటీని చాటుకున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ జనంలాగే కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వీధుల్లో కనిపించారు. తల్లిదండ్రు లు నారాయణమూర్తి, సుధామూర్తితో పాటు అక్షతా మూర్తి తన పిల్లలతో కలిసి మార్కెట్లో తిరిగారు.
అక్కడే ఫుట్పాత్ మీద ఉన్న ఓ బుక్స్టాల్ను ఆమె పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
