మోడీకి కృతజ్ఞతలు చెప్తూ విద్యాసంస్థలన్నీ బ్యానర్లు కట్టాలి

మోడీకి కృతజ్ఞతలు చెప్తూ విద్యాసంస్థలన్నీ బ్యానర్లు కట్టాలి

దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్తూ బ్యానర్లు కట్టాలని ..అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది UGC. ఈ మేరకు UGC కార్యదర్శి రజనీశ్ జైన్ వివిధ యూనివర్శిటీల అధికారులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. ఈ విషయాన్ని దాదాపు మూడు విశ్వ విద్యాలయాల అధికారులు కన్ఫామ్ చేశారు. ఐతే దీనిపై రజనీశ్ జైన్ మాత్రం స్పందించలేదు. నిన్నటి నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఫ్రీ వేస్తున్నందున ఇంగ్లీష్,హిందీలో బ్యానర్లు కట్టాలని సూచించారు. సమాచార, ప్రసార శాఖ తయారు చేసిన కొన్ని బ్యానర్ల నమూనాలను ఈ మెసేజ్ తో పాటు పంపారు. ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, భోపాల్, బెన్నెట్, గురుగ్రామ్ లోని కొన్ని యూనివర్శిటీలు బ్యానర్లు కట్టాయి. ఐతే ఈ చర్యను పలువురు తప్పు పడుతున్నారు. ఉచిత వ్యాక్సిన్ అనేది ప్రజల హక్కు అని, ప్రజా ధనంతోనే టీకాలు వేస్తున్నారని చెప్తున్నారు. టీకాలు వేయడంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి కేంద్రం చూస్తొందని ఆరోపిస్తున్నారు.