ఏపీలో టీడీపీ కూటమిదే అధికారం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏపీలో టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వేదపండితులు అన్నారు.  మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించింది. గణపతి పూజతో పాటు నందికంటి మల్లికార్జున శర్మతో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. 2024 ఎన్నికలలో ఏపీలో  తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని పండితులు చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, పార్టీ సమన్వయకర్త కంభపాటి రామ్మోహన్ రావు, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి పాల్గొన్నారు.