శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి ఉగాది మహోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో 2024 ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవ ఏర్పాట్లపై కర్ణాటకలో పలు భక్త బృందాలతో దేవస్థానం సమన్వయ సమావేశం నిర్వహించారు. బాగుల్కొట్ జిల్లా రబ్బని పట్టణంలో నిర్వహించిన సమావేశంలో శ్రీశైలం జగద్గురువు పీఠాధిపతి చెన్నసిద్ద రామశివచర్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను దేవస్థానం అధికారులు వివరించారు. 

కన్నడ భక్తుల రద్దీ దృష్ట్యా 2024 మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు నాలుగు విడతలుగా భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం కల్పించనున్నట్లు  తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు దేవస్థానం అధికారులు.