రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ సందడి

హార్టికల్చర్ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఉద్యాన్​ ఉత్సవ్’ ఏర్పాటు చేశారు. వివిధ రకాల పంటలు, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేందుకు 50 స్టాళ్లు అందుబాటులో ఉంచారు. ఏనుగులు, నెమళ్లు ఆకారంలో రంగురంగుల పూల మొక్కలు స్పెషల్​ అట్రాక్షన్​గా నిలుస్తున్నాయి.

వాటి వద్ద ఫొటోలు దిగుతూ సందర్శకులు ఎంజాయ్​చేస్తున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. మొదటిరోజైన గురువారం 16 వేల మంది ఉత్సవ్​ను సందర్శించారు. ఈ నెల13 వరకు కొనసాగనుంది.  – వెలుగు, సికింద్రాబాద్