కరుణానిధి స్థానం నుంచి ఎన్నికల బరిలోకి ఉదయనిధి

కరుణానిధి స్థానం నుంచి ఎన్నికల బరిలోకి ఉదయనిధి

తమిళనాడు రాజకీయాల్లోకి మరో వారసుడు వచ్చారు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తన తాత, దివంగత కరుణానిధి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానంలో ఉదయనిధి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్టాలిన్ ఎప్పటిలానే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా  ఉన్నారు. మూడేళ్ల క్రితమే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం  మొదటి నుంచి డీఎంకేకు కంచుకోటగా ఉంది. ఉదయనిధి ప్రస్తుతం ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కరుణానిధి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

173 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను స్టాలిన్ ఇవాళ(శుక్రవారం) ప్రకటించారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు పోటీగా తంగా తమిళ్ సెల్వన్ ను ఆయన బరిలోకి దించారు.