కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలకు చెందిన సైంటిస్ట్ లు నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నారు. ఓ దేశానికి చెందిన సైంటిస్ట్ లు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తుంటే మరో దేశానికి చెందిన సైంటిస్ట్ లు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. ఇంకో దేశానికి చెందిన సైంటిస్ట్ లు కరోనా వైరస్ సోకిన బాధితుల్ని గుర్తించే దిశగా పరిశోధనల్లో నిమగ్నమవుతున్నారు.
సాధారణంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వైరస్ సోకుతుందన్న విషయం తెలిసిందే. అందుకే పబ్లిక్ లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ భయాందోళనల్ని దూరం చేసేందుకు అమెరికాకు చెందిన సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ సైంటిస్ట్ లు ఓ మెడిసిన్ పై పరిశోధనలు చేస్తున్నారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్లు ఎదుటి వారిపై పడకుండా.. కిందపడేలా పరిశోధనలు చేస్తున్నారు. సైంటిస్ట్ లు పరిశోధనలు చేస్తున్న ట్యాబ్లెట్ వేసుకుంటే దగ్గినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు బరువు పెరిగి భూమిని తాకుతాయి. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చు
