ఉబెర్ 3,700 మంది ఉద్యోగులను తొలగించింది

ఉబెర్ 3,700 మంది ఉద్యోగులను తొలగించింది

కరోనాను అరికట్టడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో చాలా సంస్థలు నష్టాలబారిన పడుతున్నాయి. నష్టాల్లో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కరోనా కారణంగా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు సంస్థలు తమ ఉద్యోగులను చాలా వరకు తొలగిస్తున్నాయి. లేటెస్ట్ గా ట్యాక్సీ రైడింగ్ యాప్ ఉబెర్ కూడా అదే బాటపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ ద్వారా 3,700 మంది ఉద్యోగులతో మాట్లాడిన ఆ సంస్థ కస్టమర్ సర్వీస్ హెడ్ రఫిన్ చావెలీ.. సంస్థలో వారికి ఇదే చివరి రోజుని, అందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్టు చెప్పారు.

కేవలం 3 నిమిషాలపాటు సాగిన ఈ కాల్‌ ద్వారా తమ ఉద్యోగుల్లో 14 శాతం మందిని తొలగించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసు లేకుండా, అందరికీ ఒకేసారి కాల్ చేసి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.