నగదు లావాదేవీల్లో తేడాలొచ్చాయని ఇద్దరు వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయంలో కొట్టుకున్నారు. ఒకరినొకరు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు తహసీల్దార్ కార్యాయంలో సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి, జోహాపురం వీఆర్వో కృష్ణదేవరాయ డబ్బుల లెక్కల్లో తేడాలొచ్చాయని ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సుంకేసుల వీర్వో వేణుగోపాల్ రెడ్డి చెవిని కొరికి గాయపర్చాడు జోహాపురం వీఆర్వో కృష్ణదేవరాయ. వేణుగోపాల్ రెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేణుగోపాల్ రెడ్డి డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ కృష్ణదేవరాయ ఆరోపిస్తున్నాడు. వీర్వోలు కొట్టుకున్న విషయం తెలిసిన కర్నూలు ఎమ్మార్వో తిరుపతి సాయి జిల్లా కలెక్టర్ ,ఆర్డీవో, డీఆర్వోలకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులోని సీసీటీవి ఫుటేజీలను కలెక్టర్ కు చూపించాడు.


