తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్

  • రూ.3.71 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
  • ఇద్దరు నిందితులు రిమాండ్​

మరికల్, వెలుగు : తాళాలు వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు.  మంగళవారం మరికల్‌‌‌‌‌‌‌‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మక్తల్​ మండలం చందపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు  చెందిన నర్సింలు, వడ్వాట్​కు చెందిన కొల్పూర్​ నర్సింహలు మధ్యాహ్నం రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు.  ఈ నెల 2న మరికల్‌‌‌‌‌‌‌‌లోని  రెండు ఇండ్లలో, పూసల్​పాహడ్‌‌‌‌‌‌‌‌లో  ఓ ఇంట్లో చోరీ చేశారన్నారు.  

వీరిద్దరూ మరికల్​ ఆర్టీసీ బస్టాండ్​లో తిరుగుతుండగా పోలీసులు గమనించి అనుమానంతో పట్టుకున్నారు. గతంలో వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు చెప్పారు. మూడు ఇండ్లలో 5.3 తులాల బంగారం, 35 తులాల వెండి వస్తువులను రీకవరి చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.3.71లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన మరికల్ సీఐ రాజేందర్​రెడ్డి, ఎస్సై మురళి, క్రైమ్​టీం రవీందర్, తిరుపతి రెడ్డిలను డీఎస్పీ అభినందించి క్యాష్​ రివార్డులను 
అందించారు.