కర్నాటక మద్యం పట్టివేత

అయిజ, వెలుగు: మండలంలోని కుట్కనూరు గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం పట్టుకొని, ఇద్దరిని  అదుపులోకి తీసుకున్నట్లు గద్వాల ఎక్సైజ్  సీఐ గణపతిరెడ్డి తెలిపారు. కర్నూల్​ జిల్లా కనకవీడుపేట గ్రామానికి చెందిన రాముడు, మల్లేశ్​ తరలిస్తున్న 25.92 లీటర్ల మద్యం, బైక్​లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని చెప్పారు. ఎక్సైజ్ ఎస్ఐలు వెంకటేశ్, నాగరాజు, కానిస్టేబుళ్లు మహేశ్, వేణు, శేఖర్, రాజు పాల్గొన్నారు.