లవ్ జిహాద్ పై ఓ వైపు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంటే మరోవైపు.. ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర ఘటన జరిగింది. బరేలీ జిల్లాలో ఇద్దరు ముస్లిం యువతులు హిందూ వ్యక్తులను పెళ్లాడారు. ఈ పెళ్లి కోసం ఆ యువతులు మతం కూడా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత తమకు రక్షణ కావాలంటూ వారు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు వెంటనే స్పందించి వారికి భద్రత కల్పించారు.
మతాంతర వివాహాలు చేసుకున్న ఈ యువతులిద్దరూ బరేలీ జిల్లాలోని హఫీజ్ గంజ్, బహేది ప్రాంతాలకు చెందినవారు. హఫీజ్ గంజ్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి ప్రేమ వ్యవహారంలో కిడ్నాప్ కేసు నమోదు కాగా, ఇద్దరూ మైనారిటీ తీరినవారేనని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు.
